అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

53చూసినవారు
అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎచ్చర్ల లోని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది విభిన్నంగా డా. బిఆర్ఏయూ యోగా అండ్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్శిటీ విద్యార్థులతో పాటు పలువురు చిన్నారులు పాల్గొని యోగసనాలు, ధ్యాన విన్యాసాలు చేశారు. లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన 'సంజీవిని సేవా సంఘం' చిన్నారులు ప్రదర్శించిన పలు రకాల యోగా ఆసనాలు, కనపరిచిన ప్రతిభ వర్శిటీ వర్గాలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. బిఆర్ఏయూ వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప శాంతియుతమైన శక్తి యోగ విద్య అని అభిప్రాయపడ్డారు. యోగా శరీరం, మనస్సునే కాకుండా మనుషులందరినీ ఐక్యతగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్