ఐఐఐటీకి ఏంపికైన పోలీస్ క్వార్టర్స్ పాఠశాల విద్యార్థులు

57చూసినవారు
ఐఐఐటీకి ఏంపికైన పోలీస్ క్వార్టర్స్ పాఠశాల విద్యార్థులు
ఎచ్చెర్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ క్వార్టర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీరాములు గురువారం తెలిపారు. విద్యార్థులు హార్షిత్ హర్యాక్స్ 586 మార్కులు, జరుగుళ్ళ అంజలి 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీకు వారు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్