25 నుంచి మహిళలకు టైలరింగ్లో శిక్షణ

65చూసినవారు
25 నుంచి మహిళలకు టైలరింగ్లో శిక్షణ
ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్