వైభవంగా జింకి భద్ర గ్రామదేవత సంబరం

75చూసినవారు
సోంపేట మండలంలోని జింకిభద్ర గ్రామంలో మంగళవారం గ్రామదేవత సంబరం వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతనదారులు గ్రామదేవతలకు చల్లదనం నిర్వహించటానికి సంబరం చేసినట్లు తెలిపారు. ఈ సంబర మహోత్సవంలో యువతులు కోలాటం, జానపద నృత్యాలు ప్రదర్శించారు. వీటిని తిలకించేందుకు గ్రామస్తులు ఉత్సాహం చూపారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారిని చల్లదనం చేశారు.

సంబంధిత పోస్ట్