ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి విఫలయత్నం చేశారు. బుధవారం కార్యాలయం తెరిచే సరికి బీరువా తెరిచి కాగితాలు చిందర వందరగా పడి ఉండడం గమనించిన సిబ్బంది పట్టణ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరణ చేశారు. పట్టణ ఎస్ఐ చిన్నంనాయడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.