గొల్ల పుట్టుగలో వైసిపి ఇంటింటా ప్రచారం
కవిటి మండలంలోని గొల్లపుట్టుగలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పాలన అందించిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలపాలని, స్థానిక పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.