కవిటి: ఈకోఆర్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ గా శ్రీనివాస్ రంగా రౌళో
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్ కు చెందిన టీడీపీ సీనియర్ నేత శ్రీనివాస్ రంగా రౌళోను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ గా రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఒకే పార్టీని నమ్ముకుని కష్టకాలంలో సేవలను గుర్తించి పదవి ఎంపిక పట్ల శ్రీనివాస్ రంగా హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.