కొత్తూరు మండలంలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు ఏర్పడి గంటపాటు కొండపోత వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది.