పలాస- కాశీబుగ్గలోగల శాఖా గ్రంధాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత నిధులతో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు ట్రస్ట్ ద్వారా సుమారు రూ. 75 వేల ఖరీదైన వివిధ రకాల పుస్తకాలను వితరణ చేశారని ఆమె తెలిపారు. అనంతరం గౌతు లచ్చన్న, కింజరాపు ఎర్రన్నాయుడు చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.