వజ్రపు కొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వేప, జిల్లేడు, సీతాఫలం, జామి, బొప్పాయి ఆకులను మూత్రంలో మరగబెట్టి ఎకరాకు 5లీటర్లు, 100 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు వివరించారు. ఇలా చేయడం వల్ల వరిలో కాండం తోలుచు పురుగు నివారణ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పెంటయ్య, సంగీత పాల్గొన్నారు.