పాతపట్నంలో 91 పనులకు రూ.53కోట్ల నిధులు మంజూరు

78చూసినవారు
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం మండలం లోగిడి, లాభరా పేడూరు, బొమ్మిక గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం మండలంలో ఇటీవల జరిగిన గ్రామ సభల్లో 91 పనులు గుర్తించడం జరిగిందన్నారు. వీటి పనుల కోసం 53 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్