పాతపట్నం: మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల పరిశీలన

71చూసినవారు
పాతపట్నం మండలంలోని కాగువాడ మహాత్మా జ్యోతి రావ్ పూలే బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలిపారు. విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని విధాల చక్కగా చూడాలన్నారు.