ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వం ద్యేయమని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం హిరమండలం మండలంలోని గొట్ట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి.మేనక, మండల ప్రత్యేక ఆహ్వానితులు టి. తిరుపతిరావు, ఎంపీడీవో శైలజ, తహసీల్దారు వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.