భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధరించిన విషయం తెలిసిందే. మంకీపాక్స్ 1958లో డెన్మార్క్‌లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాల్లో వెలుగుచూశాయి. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నది క్లేడ్-1 రకం వల్లే. అందుకే ఇది ప్రాణాంతకమైంది.