వ్యవసాయంలో యాంత్రీకరణ పై రైతులు దృష్టి సారించాలి
వ్యవసాయంలో యాంత్రీకరణపై రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. గురువారం పోలాకి మండలం మబగాం గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ఉడుపి యంత్రంతో వరి నాట్లు ఆయన వేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగమంతా వ్యవసాయ యాంత్రికత వైపు మారాల్సిన సమయం ఆసన్నమైనదని, కూలీల కొరతను అధిగమించడానికి ఇది అత్యంత ఆవశ్యకతను తెలియజేశారు. ప్రభుత్వం కూడా రైతులకు సహకరిస్తుందన్నారు.