Sep 20, 2024, 01:09 IST/
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
Sep 20, 2024, 01:09 IST
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవనున్నాయి. తాజాగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. వాటిలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లుండి వరకు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.