వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవో, పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.