రాజాంలో వైన్ షాపులను ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ బాజ్జీ రావు బుధవారం తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణాల్లో ఎటువంటి అక్రమాలకు తావివ్వకూడదని నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని ఓనర్ని హెచ్చరించారు. అనంతరం రాజాం ప్రోహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్లో కేసుల వివరాలు సీఐ ఆర్. జైభీమ్ను అడిగి రికార్డ్సును పరిశీలించారు. నాటుసారా మద్యం గొలుసు దుకాణాలను ఉపేక్షించవద్దని అన్నారు.