రేపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా పర్యటన
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 11వ జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్-బాల్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12. 15 గంటలకు కోటబొమ్మాళి మండలం తాటిపర్తి గ్రామంలో మెండ భాస్కరరావు వర్ధంతి సభలో పాల్గొంటారన్నారు.