108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

448చూసినవారు
108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
108 ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టెక్కలి నియోజకవర్గ 108 ఉద్యోగులు కోరారు. ఈ మేరకు టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం తన ఆఫీస్ వద్ద కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం 108 సిబ్బంది మాట్లాడుతూ.. రాత్రనక పగలనక నిస్వార్ధంగా పేదలకు గత 17 ఏళ్లుగా సేవలందించిన ఉద్యోగులను చిన్నచిన్న కారణాలు చూపించి విధుల నుంచి తొలగించడం, వేరే జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయడం చాలా బాధాకరమన్నారు.

విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ.. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం 108 ఉద్యోగులు దేవాది శ్రీనివాసరావు, జోగి ఆదినారాయణ, శ్రీనివాస్ బెహర, కంచరాన వెంకటరమణ, వాన కుమార స్వామి, బొడ్డేపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్