AP: అదానీ వ్యవహారంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలు చర్చలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలిస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు.