హైదరాబాద్ బసవతారక ఇండోఅమెరికన్ కేన్సర్ హాస్పిటల్ లో బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన గుర్రం గురవయ్యకు అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవాసంఘం సభ్యుడు మూగి దుర్గారావు వెంటనే స్పందించారు. బసవతారక ఇండోఅమెరికన్ కేన్సర్ హాస్పిటల్ వెళ్లి రక్తదానం చేసి కేన్సర్ పేషెంట్ ని ఆదుకున్నడని అభయం యువజన సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఆపదలో ఉన్న కేన్సర్ పేషెంట్ కి ప్లేట్లెట్స్ దానం చేసిన మూగి దుర్గారావు ని అభయం సేవాసంఘం సభ్యులంతా అభినందించారు. అన్ని సేవా కార్యాక్రమాల్లో మా అభయం యువజన సేవాసంఘం సభ్యులు ముందుంటారని మరొక్కసారి నిరూపించుకున్నారని దేవాది శ్రీనివాసరావు తెలిపారు.