రూ.54 వేలు విరాళాల సేకరణ

766చూసినవారు
రూ.54 వేలు విరాళాల సేకరణ
టెక్కలి లో నెలకొన్న అభయం యువజన సేవాసంఘం వాళ్లు విద్యార్థులలో చిన్నతనం నుండే నలుగురికి సహాయపడలనే ఆలోచన రావాలని, పలు కళాశాలకు వెళ్లి ఇటీవల బాణసంచా పేలుడు లో గాయపడ్డ వాకాడ హరికి, అలాగే తలసేమియా వ్యాధి తో భాదపడుతున్న 5 సంవత్సరాల చిన్నారి షణ్ముఖ ప్రియ ల వైద్యం కొరకు ఇంటర్మీడియట్ విద్యార్థులచే వాళ్ళ గ్రామాల్లో విరాళాలు సేకరించమని ప్రేరణ కలిగించడం జరిగింది. ఈ ప్రేరణ మంచి ఫలితాన్ని ఇచ్చిందని అభయం యువజన సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ప్రేరణ తో ఈ రోజు మదర్ థెరిస్సా జూనియర్ కాలేజీ విద్యార్థులు 20000, విశ్వజ్యోతి జూనియర్ కాలేజీ విద్యార్థులు రూ. 13000, బి ఎస్ అండ్ జే ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రూ.11000, యస్ వి ఆర్ కె జూనియర్ కాలేజీ విద్యార్థులు రూ.10, 000 విరాళాలు సేకరించి అభయం సేవాసంఘం ప్రతినిధులకి అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అభయం సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తో పాటు సంఘ సభ్యులు యన్ సింహాచలం, బోయిన నాగరాజు మరియు ఆ కళాశాల ప్రిన్సిపాల్స్ కె వి రమణ గారు, డి రవి గారు, కె శ్రీను గారు, యమ్ మోహన్, రమేష్ గారు మరియు నిధులు సేకరించిన విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్