బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు అని టెక్కలి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి మల్ల తెలిపారు. 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' ప్రచారంలో భాగంగా బుధవారం టెక్కలిలోని గోపీనాథపురం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఆయన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. 21 ఏళ్లు నిండని పురుషులు, 18 ఏళ్లు నిండని స్త్రీలు వివాహం చేసుకొంటే దానిని బాల్య వివాహంగా పరిగణించి శిక్షకు అర్హులు అవుతారన్నారు.