తల్లిపై కుమారుడి దాడి
నవమాసాలు మోసి పెంచిన తల్లిపై కుమారుడు దాడి చేసిన అమానవీయ ఘటన వజ్రపుకొత్తూరు మండలంలో జరిగింది. సుంకర జగన్నాథపురం గ్రామానికి చెందిన కమలమ్మ భర్త చనిపోవడంతో పిల్లలు ఉన్నా ఒంటరిగా ఉంటోంది. ఇంటి విషయమై పెద్ద కుమారుడు దానయ్యతో ఆమెకు గతంలో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా తవ్వుకున్న బోరు వేసేందుకు తల్లి వెళ్లగా ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీంతో అతడిపై తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.