వైసీపీ కోసం పని చేసిన డీఎస్పీల సస్పెన్షన్

1537చూసినవారు
వైసీపీ కోసం పని చేసిన డీఎస్పీల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీతో అంట కాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర రెడ్డి, ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారు. రాజంపేటకు బదిలీ అయినా కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పని చేశారు.

సంబంధిత పోస్ట్