సోషల్మీడియా యాక్టివిస్ట్ల అక్రమ అరెస్టులపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఇవాళ ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. టీడీపీ నేేతల పోస్టుల వల్లే తెనాలికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హిట్లర్ లాంటి గతే టీడీపీ పెద్దలకు పడుతుందని ఆరోపించారు. అప్పట్లో NTR ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తనను బూచిగా చూపించారని ఆమె అన్నారు.