ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏకంగా ఆయా ఇళ్లను జియో మ్యాపింగ్ చేయడంతో పాటు కుటుంబంలోని వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటా బేస్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుటుంబ సర్వే బాధ్యతలను గత ప్రభుత్వం వాలంటీర్లకు అప్పగించగా.. ప్రస్తుత ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది.