లిచీ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్–సి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా పిగ్మెంటేషన్ తగ్గి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాకపోతే ఈ పండ్లను రోజుకు 7 మాత్రమే తినాలి. ఎందుకంటే ఈ పండ్లను ఎక్కువగా తింటే మెదడు వాపు వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.