ఆమ్స్టర్డ్యామ్ (నెదర్లాండ్స్) లో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఇజ్రాయెల్ పౌరులపై ప్రో పాలస్తీనియన్లు దాడి చేశారు. జోహన్ క్రైఫ్ అరేనా స్టేడియం వెలుపల జరిగిన ఈ ఘర్షణలో 10 మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడగా, మరో ఇద్దరు కనిపించకుండాపోయినట్లు సమాచారం. దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు ఆమ్స్టర్డ్యామ్ కు రెండు రెస్క్యూ విమానాలను పంపి పౌరులను తరలించాలని ఆదేశించారు. హోటళ్లలో ఉన్నవాళ్లు బయటకు రావొద్దని సూచించారు.