AP: విద్యుత్ ఛార్జీలపై టీడీపీ, వైసీపీ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. '2014 నుంచి 2019 మధ్య టీడీపీ యూనిట్ విద్యుత్తును రూ.4.70కి కొంటే, జగన్ 2019 నుంచి 2024 మధ్య యూనిట్ విద్యుత్‌ను రూ.7.61కి కొన్నారు. ఆ భారాన్ని ఇప్పటి వరకు జనం మోస్తూనే ఉన్నారు. తక్కువకే వచ్చే కరెంట్‌ను ఎక్కువకు ఎందుకు కొన్నావ్? అని ధర్నా చేస్తున్న జగన్‌ను ప్రజలు నిలదీయాలి' అని ట్వీట్ చేసింది.