ఇంకా కొలిక్కి రాని ‘చెక్క పెట్టెలో శవం’ కేసు

54చూసినవారు
ఇంకా కొలిక్కి రాని ‘చెక్క పెట్టెలో శవం’ కేసు
AP: ప.గో. జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది శ్రీధర్ వర్మ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఘటన జరిగిన రోజు సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన మహిళ పెట్టెను యండగండి తీసుకెళ్లాలని ఆటోడ్రైవర్‌కు పురమాయించి వెళ్లిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్