AP: కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లీబిడ్డను హత్య చేసింది భర్తేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భార్య సలీమా (24), కూతురు సమీరా (4)ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేల్చారు. మగబిడ్డ పుట్టాలని భార్యను హింసించే వాడని, ఈ క్రమంలో గొడవ పడిన సక్రప్ప.. భార్య సలీమా, కూతురు సమీరా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు.