అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌకలోని 12 మందిని.. భారత్, పాకిస్థాన్ తీర ప్రాంత రక్షణ బలగాలు సంయుక్తంగా కాపాడాయి. ఈనెల 4న భారత్‌కు చెందిన అల్ పిరాన్ పిర్ అనే నౌక.. పోర్ బందర్ నుంచి ఇరాన్ వెళ్తుండగా బలమైన అలల తీవ్రతకు అరేబియా సముద్రంలో భారతీయ జలాలకు అవతల మునిగిపోయింది. నౌక మునిగిపోయేలోపే అందులో ఉన్న సిబ్బంది.. పడవ సాయంతో బయటపడ్డారు. సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని తీరప్రాంత రక్షణ దళాలు కాపాడాయి.