తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు ఏవీ కొనేటట్టు కనిపించడం లేదు. కూరగాయలు కూడా కిలో రూ.60కి తక్కువ లేవు. కాస్తో కూస్తో కోడి గుడ్డే చవకగా ఉందనుకుంటే ఇప్పుడు అదీ కొండెక్కి కూర్చుంటోంది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7కి తక్కువ లేదు. కొన్ని జిల్లాల్లో రూ.8కి ఎగబాకేసింది. హోల్‌సేల్‌లో వంద గుడ్ల ధర రూ.700కు చేరింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు.