దలాల్ స్ట్రీట్లో మరోసారి వైరస్ గుబులు మొదలైంది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,700 స్థాయికి చేరుకుంది. దీంతో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.