ప్రియురాలి తండ్రిని నరికి చంపిన యువకుడు

61చూసినవారు
ప్రియురాలి తండ్రిని నరికి చంపిన యువకుడు
AP: విజయవాడకి చెందిన శ్రీరామప్రసాద్‌(56) కుమార్తె దర్శిని, గడ్డం శివమణికంఠ(26) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావ‌డంతో వారి పెళ్లికి ప్రసాద్ ఒప్పుకోలేదు. ఆయ‌న మణికంఠ ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టారు. దీంతో ప‌గబ‌ట్టిన మ‌ణికంఠ గురువారం మాటువేసి బైక్‌పై వ‌స్తున్న తండ్రి, కూతుళ్లను త‌న బైక్‌తో ఢీకొట్టాడు. దర్శిని ప్రాధేయపడుతున్నా వినకుండా ప్రసాద్‌ను కత్తితో దారుణంగా న‌రికాడు. దీంతో ప్రసాద్ ప్రాణాలు విడిచాడు.