షాకింగ్ ఘటన.. ఇంజెక్షన్‌ వల్ల నిండు గర్భిణీ మృతి!

68చూసినవారు
షాకింగ్ ఘటన.. ఇంజెక్షన్‌ వల్ల నిండు గర్భిణీ మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విక్రమ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆంచల్ అనే 23 ఏళ్ల మహిళను కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబీకులు అడ్మిట్ చేశారు. డాక్టర్లు వినయ్‌ కుమార్‌ పాండే, శివ్ బహదూర్ యాదవ్ ఆపరేషన్‌ కోసం రూ.50,000 కట్టించుకున్నారు. ప్రసవం కోసం అంచల్‌కు ఒక ఇంజెక్షన్‌ ఇచ్చారు. అస్వస్థతకు గురైన ఆమెతోపాటు కడుపులోని పిండం కూడా మరణించింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్