ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇందులో ముగ్గురు జనసేనకు చెందిన వారు అయితే ఒకరు బీజేపీకి చెందిన వారు. అయితే మంత్రుల మధ్య సరైన కో ఆర్డినేషన్ లేదని వారి పనితీరు ఇంకా మెరుగుపడాలని వార్తలు వస్తున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు- మంత్రి నాదెండ్లకు జరిగిన సంభాషణపై వైసీపీ రియాక్ట్ అయింది. కూటమి ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ లేదని ఎక్స్‌లో వైరల్ చేస్తోంది.