గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో ఎస్ఐలు సుమన్, రాజ్ కుమార్, వెంకటసుబ్బయ్య పోలీసు సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించి 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఏడు మంది అనుమానితులు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.