టిడిపి ఎస్సీ సెల్ ఆత్మీయ సమ్మేళనం

74చూసినవారు
టిడిపి ఎస్సీ సెల్ ఆత్మీయ సమ్మేళనం
వాకాడులో సినిమా హాల్ వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టీడీపీ ఎస్సీ సెల్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు భుజగేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు, ఎస్సీ సెల్ నాయకులు పెంచలయ్య, రమణయ్య, వసంత కుమార్ తదితరులు హాజరుకానున్నట్లు వారు తెలిపారు. వాకాడు మండలంలోని ఎస్సీ సోదరులందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you