మనీలాండరింగ్‌ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు

85చూసినవారు
మనీలాండరింగ్‌ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు
మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్‌ 19 ప్రకారం నిందితుడిని అరెస్ట్‌ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీలాండరింగ్‌ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్