Oct 16, 2024, 16:10 IST/
TG: గ్రూప్స్ అభ్యర్థుల నిరసన.. అశోక్‌నగర్‌లో టెన్షన్ టెన్షన్
Oct 16, 2024, 16:10 IST
హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని, అలానే GO.29ను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని.. 10 మందిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.