జమ్మలమడుగు: కోడి వచ్చిందని కుటుంబంపై దాడి
కోడి తెచ్చిన తంటా ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉండే నాగలక్ష్మమ్మ చెట్టుపై పక్కింటి కోళ్లు వచ్చి పెంట వేస్తున్నాయని రోషమ్మకు చెప్పింది. దీంతో రోషమ్మ కుటుంబ సభ్యులతో నాగలక్ష్మమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో నాగలక్ష్మమ్మ, భర్త, కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్చారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు