సంతాప సూచకంగా ఎమ్మెల్యే కార్యక్రమాలు రద్దు

54చూసినవారు
సంతాప సూచకంగా ఎమ్మెల్యే కార్యక్రమాలు రద్దు
కావలి మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ మృతి కారణంగా సంతాప సూచకంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం పర్యటనను రద్దు చేస్తున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది. అల్లూరు మండలంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్యే పర్యటించాల్సి ఉండగా ఆమె మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ రద్దు చేశారు. కాగా బుధవారం జరగాల్సిన కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని ఎమ్మెల్యే నెల్లూరు వెళ్ళిన విషయం తెలిసిందే.