గాంధీజీకి నివాళులర్పించిన అబ్దుల్ అజీజ్, బీద రవిచంద్ర
గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారు అంటే అందులో గాంధీజీ పాత్ర ఎంతో ఉందన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరు నడవాలన్నారు.