నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఆదివారం ఇద్దరు దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు విన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి తగిన సహాయం అందజేశారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వాటితో పాటు తన వంతుగా కూడా సాయం చేస్తామన్నారు.