రాష్ట్రస్థాయి 108 ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ. 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదని డిమాండ్ చేశారు. 108 వాహన సిబ్బందికి ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సత్యవేడు నియోజకవర్గ 108 వాహన సిబ్బంది ధర్నాలో పాల్గొన్నారు.