నెల్లూరు జిల్లా, ఉదయగిరి పట్టణంలోని పొన్నెబోయిన చెంచురామయ్య అతిథి గృహంలో గురువారం టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చెంచుల బాబు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు చేయించకపోవడంతోనే వర్షాల వల్ల పెద్ద విపత్తు జరిగిందని వివరించారు.