ఉదయగిరి: ఎడతెరిపి లేకుండా వర్షం
ఉదయగిరి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షం పడగా మరి కొన్ని గ్రామాల్లో ఆకాశం మేఘ అమృతమై ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన విషయం తెలిసిందే.